క్షీరసాగరమధనం
దేవదానవులు క్షిర సాగరం మదిస్తుంటే అమృతం పుట్టింది.
ఆ అమృతాన్ని ఎలా పంచుకోవాల అన్న విషయం మీద దేవా దానవులు ఘర్షణకు దిగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని రూపం దాల్చి వారి ఇరువురి మధ్యకు వయ్యారంగా వచ్చి నిలబడ్డాడు . మనసులు మెలిపెట్టి మరులను రగిలించే మన్మధ శరణు లాంటి ఆ సుందరాంగి వంపుసొంపులకు తళతళకు దానవులు తబ్బిబ్బే కనురెప్పలు వెయ్యటం కూడా మాని గుటకలు వేస్తూ నిలబడిపోయారు.
జగన్మోహిని తన సౌందర్యంతో దానవులు కళ్ళకు కనువిందు చేస్తూ అమృతాన్ని దేవతలకు పంచిపెట్టి మాయమైపోయింది.
ఈ విషయాన్నీ కలహభోజనుడైన నారదుడు పరమశివుని చెవిలో ఊదాడు . అప్పుడు పరమశివుడు మనోనిగ్రహం లేని నీవంటి వారు విష్ణు మాయ విలాసానికి లోనవుతారే కానీ నావంటి విరగని ఎలాంటి సౌందర్యం వంచించదు లేదు అన్నాడు. అంతటితో ఆగక పరమశివుడు విష్ణువుని కలిసి జగన్మోహిని రూపాన్ని చూపించు అని అడిగాడు
. పరమేశ్వరుడు అడిగితే పరంధాముడు కాదనగలడా .మరల జగన్మోహిని రూపం దాల్చాడు.
విశ్వాన్ని సైతం వివశతకు గురిచేస్తూ అసాధారణ సౌందర్య భావన చూసి విరాగి స్మశాన సంచరియుడైన పరమశివుడు శృంగార రసావేశానికి లోనై తనను తానే మరిచి ఆ జగన్మోహిని వెంటపడ్డాడు
. జగన్మోహిని చిక్కక చిరునవ్వులు చిందిస్తూ పరుగులు తీస్తుంది. భూలోకంలోకి వచ్చి ఆ నర్తకి శిలా రూపం దాల్చింది . అదే మన తూర్పు గోదావరి జిల్లాలోని ర్యాలీ అనే గ్రామం .

No comments