VADAPALLI VENKATESWARA SWAMY(ఏడు శనివారాలు వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం)
వాడపల్లి వెంకటేశ్వర ఆలయ సమాచారం
ఆత్రేయపురం :
కోనసీమ తిరుపతిగా ఖ్యాతిగాంచిన వాడపాల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రం ఆత్రేయపురం మండలంలో ఉంది. ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 5 గంటలకు ద్రావిడ పారాయణ , సేవాకాలం , అనంతరం బాలభోగం నివేదన జరుపుతారు. ఉదయం 7. 30 నుంచి 9. 30 గంటలకు నిత్యా కల్యాణాలు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మహా నివేదన అనంతరం ఆలయం మూసివేస్తారు. తిరిగి మధ్యాహ్నం 4 నుంచి రాత్రి 8 గంటల వరకూ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 8 గంటలకు స్వామి వారి పవళింపు సేవ నిర్వహిస్తారు.
ప్రతి శనివారం ఉదయం 3. 30 నించి 4 గంటల వరకు స్వామి వారి సుప్రభత సేవ ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల వరకూ భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. తరువాత ఆలయం మూసివేసి మధ్యాహ్నం 4 గంటలకు తెరుస్తారు. రాత్రి 8. 30 గంటల వరకూ భక్తులను దర్శనాలకు అనుమతించడంతో పాటూ వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

No comments